Wednesday, 4 November 2026

మహిళల జంట హత్యలపై దర్యాప్తు ముమ్మరం

హైదరాబాద్‌,జనవరి24(జ‌నంసాక్షి): పాత నగరంలో సంచలనం సృష్టించిన లంగర్‌హౌజ్‌ జంట హత్యల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. క్షుద్ర పూజల కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు… పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. బాలాపూర్‌కు చెందిన సుమిత్ర, యాదమ్మ.. అక్కాచెల్లెళ్లు. పౌర్ణమి, అమావాస్యలకు సుమిత్ర ప్రత్యేక పూజలు చేస్తున్నట్లు సమాచారం. కల్లు తాగేందుకు వెళ్తున్నామని చెప్పి సోమవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయలుదేరిన వీరిద్దరూ తిరిగి రాలేదు. మంగళవారం ఉదయం మూసీ నదిలో మహిళల మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే వీరిని ఎవరు చంపారు లేక ఎవరైనా చంపారా అన్న కోణంలోనూ దర్యాప్తు ముమ్మరం చేశారు.