జాతీయ బాలికా దినోత్సవంలో ¬ంమంత్రి
హైదరాబాద్,జనవరి24(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యతనిచ్చారని ¬ం మంత్రి మహమూద్‌అలీ చెప్పారు. వారి సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు. హైదరాబాద్ ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో జాతీయ బాలిక దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ¬ంమంత్రి.. 18 సంవత్సరాలు నిండిన ఆడబిడ్డ పెండ్లి చేసుకుంటే కళ్యాణలక్ష్మి పథకం ద్వారా లక్ష రూపాయలు ఇస్తున్నామని చెప్పారు. ఈ పథకంతో బాల్య వివాహాలు గణనీయంగా తగ్గాయని అన్నారు. అలాగే కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో పేదింటి మహిళల పెళ్ళిల్లు సక్రమంగా సాగుతున్నాయని అన్నారు. ఆడపిల్ల ఉందన్న భారం లేకుండా తల్లిదండ్రులు ధీమాగా ఉన్నారని మంత్రి అన్నారు. మహిళల రక్షణ, భద్రతకు సీఎం కేసీఆర్ ఎన్నో కార్యక్రమలు అమలు చేస్తున్నారని ఆయన తెలిపారు. అలాగే అడబిడ్డల భద్రత కోసం షీ టీమ్స్‌ను ఏర్పాటు చేయడంతో పాటు.. ఆడబిడ్డ పుట్టినప్పటి నుంచి విద్య వరకు అన్ని విధాలుగా సహాయం చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలతో చిన్న పిల్లలతో పని చేయించడం, బాల్యవివాహాలు తగ్గాయని.. పిల్లల కోసం 500 రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.




