Monday, 2 November 2026

మహిళా సమస్యలపై చర్చించని సదస్సు

హైదరాబాద్‌,నవంబర్‌30(జ‌నంసాక్షి): హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ పారిశ్రామిక సదస్సుకు వివిధ దేశాల నుండి సదస్సుకు హాజరైన వారిలో 50 శాతానికి పైగా మహిళలు ఉన్నప్పటికీ దేశంలోనూ, ప్రపంచంలోనూ సామాన్య మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు ఈ సదస్సులో చర్చించలేదు. సమానత్వం సాధికారిత గురించి సదస్సులో జరిగన చర్చలన్నీ పెట్టుబడి దారుల మధ్య సమానత్వం గురించే గాని, ప్రజల మధ్య సమానత్వం గురించి కాదు. ఈ తరహా సదస్సు దక్షిణాసియాలో జరగటం మొట్టమొదటి సారి కావడం, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె, ఆయన అధికారిక సలహాదారు కూడా అయినా ఇవాంకా స్వయంగా హాజరు కావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత ప్రతిష్టగా తీసుకున్నాయో సదస్సు నిర్వహణ తీరుతెన్నుల్లోనే కనపడుతోంది. మహిళాసాధికారత సంగతేమో వారి కనీస హక్కులు మృగ్యమయ్యాయి. స్త్రీలు, విద్యార్థినిలకు రక్షణ లేకుండా పోయింది. మహిళలపై దాడులను యథేచ్ఛగా కొనసాగిస్తూ, వారి హక్కులను కాలరాస్తూ, మహిళా సాధికారత సాధిస్తామనడం సరికాదు. భారతీయ సమాజం విలువలు కాపాడేలా మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఎన్ని చట్టాలు చేసినా మృగాళ్ల మదోన్మాదం, కుటుంబ సభ్యుల కామ దాహం, అధికారులు, స¬ద్యోగుల వికృత చేష్టలు వాళ్ల పాలిట శాపాలవుతున్నాయి. దీనికి తోడు మత ఛాందసవాదం మహిళా సమానత్వానికి మరింత హానికరంగా తయారైంది. అన్ని రంగాల్లోనూ మహిళలు ముందుంటున్నారు. ఉద్యోగాల వేటలో తమ సత్తాను ప్రపంచానికి చాటుతున్నారు. కానీ ఇంకా… విజయాలు సాధించాల్సిన ఎంతో మంది అమ్మాయిలకు రేసులో నిలబడే అవకాశం ఇవ్వడం లేదు. ఇలాంటి సదస్సులు ప్రేరణ నింపుతున్నా ప్రభుత్వ పరంగా కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంది. భూతల స్వర్గంగా పెట్టుబడిదారీ సమాజం కీర్తించే అమెరికాలోనే

అసమానతలు ఇప్పటికీ రాజ్యమేలుతున్నాయంటే లోపం ఎక్కడుందో అర్థం చేసుకోవచ్చు. అమెరికాకు చెందిన జాతీయ మహిళా న్యాయ కేంద్రం విడుదల చేసిన లెక్కల ప్రకారం ఆ దేశంలో ప్రతి ఎనిమిది మందిలో ఒక మహిళ పేదరికంలో మగ్గుతోంది. ఒంటరి మహిళలు నిర్వహించే కుటుంబాల్లో 35.6 శాతం దుర్భర పరిస్థితులను ఎదుర్కుంటున్నాయి. మనదేశంలో మహిళలు ఎదుర్కొంటున్న భయానక పరిస్థితు లను, వివక్షను ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. కొద్దిమంది మహిళలనో తమ ప్రయోజనాల కోసం పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దినా, మొత్తం సమాజ స్థితిగతులు మారకుండా వృద్ధి ఎలా సాధ్యమవు తుందన్నది మరో ప్రశ్న! ఆర్థిక సంక్షోభాల ఫలితంగా ఉన్న కొద్దిపాటి ఉపాధి పోవడం, నిరుద్యోగం పెరగడమన్నది ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామం. ఫలితంగా ప్రజల కొనుగోలు శక్తి గణనీయంగా పడిపోతోంది. మార్కెట్‌ మాయాజాలంతో వినియోగదారీ తత్వాన్ని పెంచడానికి ఎంతగా ప్రయత్నించినా పెద్దగా ఫలితం కనపడటం లేదన్నది అనేక సర్వేల నిర్ధారణ! మహిళాభివృద్ధితో పాటు, సమాజాభివృద్ధిపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా క్షేత్రస్థాయిలో నెలకొన్న ఈ దారుణ పరిస్థితులను తొలగిం చాలి. ఇది జరగాలంటే ప్రభుత్వాల విధానాలు మారాలి. కార్పొరేట్ల ప్రయోజనాలకు పెద్దపీట వేసే పాలక వర్గాలు అధికారంలో కొనసాగినంత కాలం విధానాల్లో మార్పు అసాధ్యం. నారీలోకంతో పాటు, సమస్త మానవాళి విజయం సాధించాలంటే ప్రజల ప్రయోజనాలకు పెద్దపీట వేసే ప్రత్యామ్నాయ విధానాలే మార్గం దిశగా సమాజంలోని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. మంచిచెడ్డలపై సామాజికశాస్త్రవేత్తలు, విశ్వవిద్యాల యాలు, పరిశోధకులు, విూడియారంగ నిపుణులు అధ్యయనం చేసి విశ్లేషిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. తద్వారా ఈ కార్యక్రమానికి కూడా లబ్ధి కలుగుతుందని అన్నారు. ప్రజలకు దగ్గరవడానికి, వారి స్పందనలు, కోరికలు, ఫిర్యాదులు తెలుసు కోవడానికి ఇదొక అపూర్వ అవకాశంగా అభివర్ణించారు. అయితే ఇందులో ఎందుకనో మహిళల గురించి ప్రస్తావన లేకపోవడం గమనార్హం.