మహిళ ఆత్మహత్య: మృతదేహంతో ధర్నా

నల్గొండ,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి):  మూడు రోజుల క్రితం కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యకు యత్నించిన ఓ మహిళ శుక్రవారం హైదరాబాద్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. మండలంలోని సూర్యాపేట కాసరాబాద గ్రామానికి చెందిన పంతం నాగలక్ష్మి తన భర్త కారణంగా ఒగ్గు భిక్షమమ్మ అనే మరో మహిళతో ఘర్షణ పడింది. ఈ ఘర్షణలో ఆమె భర్త మరో మహిళతో కలిసి నాగలక్ష్మిని కొట్టారు. దాంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు యత్నించినట్లు నాగలక్ష్మి వాంగ్మూలం ఇచ్చింది. నాగలక్ష్మి మృతికి కారణమైన ఒగ్గు భిక్షమమ్మ ఇంటి ముందు మృతదేహంతో బంధువులు ధర్నా చేపట్టారు.