ఎల్బీ నగర్( జనం సాక్షి ) బి ఎన్ రెడ్డి నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మి ప్రసన్న రామ్మోహన్ గౌడ్ బి ఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని సాహెబ్ నగర్ లోని మహిళ బిల్డింగ్ ను సందర్శించి పరిశీలించారు.బిల్డింగ్ నిర్మాణం పూర్తి అయిన మౌలిక సదుపాయాలు కరెంట్,టైల్స్, ఫ్యాన్స్ వంటివి పూర్తి కాలేదని తెలుసుకున్న మాజీ కార్పొరేటర్ సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు.దీపావళి పండుగ తరువాత పెండిగ్ లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తామని అధికారులు చెప్పారని మాజీ కార్పొరేటర్ తెలిపారు. ఈ సందర్భంలో పద్మ,భార్గవి,అర్చన,అరుణ,లావణ్ య,ఉమారాణి,గాయత్రి,మమత,జ్యోతి తదితులున్నారు.
మహిళ బిల్డింగ్ ను సందర్శించి పరిశీలించిన : మాజీ కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మి ప్రసన్న రామ్మోహన్ గౌడ్




