Wednesday, 4 November 2026

మాంటిస్సోరి స్కూల్లో మట్టి వినాయకుల ప్రదర్శన

హుస్నాబాద్ ఆగస్టు 30(జనంసాక్షి)హుస్నాబాద్ మాంటిస్సోరి వారి కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో మంగళవారం రకరకాల మట్టి వినాయక ప్రతిమల ప్రదర్శన నిర్వహించారు. ఒకటవ తరగతి నుండి 8వ తరగతి వరకు విద్యార్థులు మట్టి వినాయక విగ్రహాలు,కూరగాయలు, పసుపు,పిండి వంటి రకరకాల పదార్థాలతో తయారుచేసిన ప్రతిమలు ఉపాధ్యాయులను,విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో  పాఠశాల హెచ్.ఎం. అబ్దుల్ మన్నన్ మాట్లాడుతూ వాతావరణానికి హాని చేయని మట్టి విగ్రహాలను అందరూ ఈ వినాయక చవితికి ఉపయోగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో   ఉపాధ్యాయ సిబ్బంది, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.