మాక్లూరు పరీక్షా కేంద్రంలో మాన్ కాపీయింగ్
మాక్లూరు: నిజామాబాద్ జిల్లా మాక్లూరు ఇంటర్ పరీక్షా కేంద్రంలో మాన్ కాపీయింగ్ చోటుచేసుకోవడంతో ఇద్దరు అధికారులను ఆర్‌ఐవో విధుల నుంచి తొలగించారు. కలెక్టర్ క్రిష్టిన్ ఆదేశాలతో ఆర్‌ఐవో ఈ ఉదయం ఆకస్మికంగా పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రంలో మాన్ కాపీయింగ్ జరుగుతున్నట్లు గుర్తించారు. పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ పుండరీగౌడ్, డిపార్ట్‌మెంట్ అధికారి పెంటయ్యలను విధుల నుంచి తొలగించారు. ఇద్దరు అధికారులకు మెమోలు జారీ చేశారు.