యస్ రాయవరం ఫిబ్రవరి 15(జనంసాక్షి ): మండలంలోని రేవుపోలవరం గ్రామంలో జరగనున్న మాఘపౌర్ణమి తీర్ధంకు ఏర్పాట్లను స్థానిక అధికారులు పరిశీలించారు. మంగళవారం మద్యాహ్నం స్థానిక తహశీల్ధారు సత్యన్నారాయణ నేతృత్వంలో యంపిడివో చంద్రశేఖర్ ఈ వో పి ఆర్ డి సత్యన్నారాయణలు జాతర ఏర్పాట్లను పరిశీలించారు. ఇప్పటికే రెవెన్యూ, పోలీస్ వైద్య ఆరోగ్యశాఖ తదితర శాఖల మద్య సమన్వయం వంటివి పరిశీలించారు. జాతరకు వచ్చి పుణ్యస్నానాలు ఆచరించే మహిళలు దుస్తులు మార్చుకునేందుకు వీలుగా చేయాల్సిన ఏర్పాట్లు త్రాగునీరు వంటి అంశాలపై గ్రామ నాయకులు ప్రజా ప్రతినిధులతో చర్చించారు. తీరంలో ఎటువంటి ప్రమాదాలబారిన భక్తులు పడకుండా గజ ఈతగాళ్ళను నియమించినట్లు తహశీల్ధారు సత్యన్నారాయణ తెలిపారు.యాత్ర సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలని ఆయన కోరారు
మాఘపౌర్ణమి జాతర ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మార్వో




