మాచార్ల నియోజకవర్గంపై భారీ అంచనాలు

సముద్రఖని లుక్‌ విడుదల చేసిన మేకర్స్‌
నితిన్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ’మాచర్ల నియోజకవర్గం’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా కాలం తర్వాత నితిన్‌ ఫుల్‌ మాస్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు, గ్లింప్స్‌ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్‌ చేశాయి. ఇటీవలే ’రా రా రెడ్డి’ పాటకు ప్రేక్షకుల నుండి అద్భుత స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుండి సముద్రఖని ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు.ఈ చిత్రంలో రాజప్ప పాత్రలో సముద్రఖని నటిస్తున్నాడు. లేటెస్ట్‌గా విడుదలైన పోస్టర్‌లో సముద్రఖని నెరిసిన జుట్టు, విూసం కట్టుతో ఉన్నాడు. నితిన్‌ ఈ చిత్రంలో గుంటూరు జిల్లా కలెక్టర్‌గా నటించనున్నాడురాజశేఖర్‌ రెడ్డి డైరెక్షన్‌ లో వస్తోన్న ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే టీజర్‌, పోస్టర్స్‌ రిలీజ్‌ కాగా… తాజాగా మరో అప్‌ డేట్‌ వచ్చింది. విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న సముద్రఖని ఫస్ట్‌ లుక్‌ ను చిత్ర నిర్వాహకులు రిలీజ్‌ చేశారు. ఈ సినిమాలో ఆయన విలన్‌ రోల్‌ పోషించనున్నట్టు తెలిపారు. ఇక ఈ పోస్టర్‌ లో ఉన్న సముద్రఖని లుక్‌ చాలా పవర్‌ ఫుల్‌ గా కనిపిస్తోంది. ఎప్పుడూ కనిపించని రీతిలో కనిపిస్తున్న ఆయన.. ఈ సినిమాలో రాజప్పగా అలరించనున్నట్లు మూవీ మేకర్స్‌ తెలిపారు. ఇప్పటివరకూ పలు సినిమాల్లో ప్రతి నాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్న ఆయన.. ఈ సినిమాతోనూ మంచి హిట్‌ కొడతారని ఆయన అభిమానులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. పొలిటికల్‌ ఎలిమెంట్స్‌ తో మాస్‌, కమర్షియల్‌ ఎంటర్‌ టైనర్‌ గా ఈ మూవీ తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్‌ సంగీతం సమకూరుస్తున్నారు. ఆగష్టు 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌ గా విడుదల కానుంది.