టేకులపల్లి, మార్చి 4 (జనం సాక్షి ): క్రీ.శే. స్వర్గీయ మాజీ మంత్రి రామ్ రెడ్డి వెంకట్ రెడ్డి ఏడవ వర్ధంతి సందర్భంగా టేకులపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో శనివారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బోడు రోడ్డు సెంటర్లో పండ్లు,స్వీట్లు పంపిణీ చేశారు. వెంకట్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని ఆయన జ్ఞాపకార్థంగా సెంటర్లో వేసవి దాహార్తిని తీర్చడానికి చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టేకులపల్లి మాజీ సర్పంచ్ ఇస్లావత్ రెడ్యానాయక్, మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకారపు స్వప్న, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ రాస మల్ల నరసయ్య, డాక్టర్ వెల్దండి వెంకటేశ్వరరావు, బానోత్ లకుపతి, వెంకటేశ్వరరావు చౌదరి( ఎర్ర వెంకన్న ), భూక్య బన్సీలాల్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డికి ఘన నివాళి మాజీ టేకులపల్లి లో జ్ఞాపకార్ధంగా చలివేంద్రం




