Wednesday, 4 November 2026

మాజీ మంత్రి, హూజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కి ఘన స్వాగతం పలికిన :రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెల శ్రీరాములు

ఎల్బీ నగర్ (జనం సాక్షి )   ఓఆర్ఆర్ రావిర్యాల గేటు దగ్గర బీజేపీ జాతీయ నాయకులు, మాజీ మంత్రి, హూజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ గారికి మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ నేతలు స్వాగతం పలికారు. తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో బోనాల ఉత్సవాలకు హాజరవుతున్న ఈటెల రాజేందర్ అన్నకు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెల శ్రీరాములు నాయకత్వంలో ఘనంగా సన్మానించారు బీజేపీ శ్రేణులు. ఈకార్యక్రమంలో తుక్కుగూడ మున్సిపాలిటీ ఛైర్మన్ కాంటేకార్ మధు మోహన్, అధ్యక్షులు రచ్చ లక్ష్మణ్ సహా కౌన్సిలర్లు, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.