మాజీ సర్పంచుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి-పద్మపీఠం ఎడిటర్ కొక్కుల భాస్కర్.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఆగస్టు 16. (జనంసాక్షి). గ్రామాలలో సర్పంచులుగా ఉండి ప్రజలకు సేవలందించిన మాజీ సర్పంచుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని పద్మ పీఠం ఎడిటర్ కోక్కుల భాస్కర్ కోరారు. బుధవారం అంబేద్కర్ చౌరస్తా వద్ద మాజీ సర్పంచ్ మాజీ సర్పంచుల రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మాజీ సర్పంచులు ఎనిమిదో తేదీ నుండి దీక్షలు చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి దీక్షలు విరమింపచేయాలని కోరారు. . దీక్షల్లో జిల్లాలోని పలువురు మాజీ సర్పంచులుపాల్గొన్నారు.