మానవత్వం చాటుకున్న గ్రామీణ సపోర్ట్ ఫౌండేషన్

జనం సాక్షి కథనానికి స్పందన
( జనం సాక్షి) గత వారం రోజుల నుండి బారి నుండి అతి భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో మండలంలోని అబ్దుల్లాపూర్ గ్రామంలో భూమేష్ తన పెంకుటిల్లు వర్షానికి కుప్పకూలడంతో జనం సాక్షిలో భారీ వర్షానికి కులుతున్న ఇల్లు -రోడ్డున పడ్డ బాదితకుటుంభం అనే శీర్షిక ప్రచురితం కాగా గ్రామీణ సపోర్ట్ ఫౌండేషన్ స్పందించి మూడు నెలల కిరాణా నిత్యావసర సరుకులు సరిపడా అందివ్వడం జరిగిందని ఫౌండేషన్ చైర్మన్ కడారి నరేష్ తెలిపారు వర్షాలతో జరగరాని నష్టం జరుగుతున్న తరుణంలో ఇలాంటి సహాయ కార్యక్రమాలు చేయడం అభినందనీయమని బాధిత కుటుంబంతో పాటు చుట్టుపక్కల వారు అభినందించారు ఈ సందర్భంగా జనం సాక్షికి అటు బాధితుడు గ్రామీణ సపోర్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో అబ్దుల్లాపూర్ మాజీ సర్పంచ్ సత్యం తో పాటు కనకాపూర్ గ్రామానికి చెందిన ద్యావత్ పోశెట్టి తదితరులు పాల్గొన్నారు