మానవసేవే మాధవసేవ

బచ్చన్నపేట సెప్టెంబర్ 25 (జనం సాక్షి) మానవసేవే మాధవసేవ అనే విధంగా మనిషి జన్మ ఎత్తినప్పుడు పదిమందికి మేలు చేసినప్పుడే జీవితానికి స్వార్ధకత అని బచ్చన్నపేట మండల కేంద్రానికి చెందిన అందే వెంకట రాజయ్య గౌడ్ అన్నారు. ఆదివారం కీర్తిశేషులు అయినటువంటి తన అత్తమామలు. అందే వజ్రమ్మ కిష్టయ్యలా జ్ఞాపకార్థం లయన్స్ క్లబ్ ఆఫ్ జనగామ మిలీనియం వారి ఆధ్వర్యంలో 60 మంది నిరుపేద కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 కేజీల బియ్యాన్ని అందించడం జరిగింది అన్నారు. లయన్స్ క్లబ్ మిలీనియం జనగామ అధ్యక్షులు ఎలికట్ట నరేందర్. ఎల్ సి ఐ ఎఫ్ కోఆర్డినేటర్ శ్రీరామ్ శ్రీనివాస్. బచ్చన్ బచావో ఆందోళన్ రాష్ట్ర సమన్వయకర్త అందే వెంకటేశ్వర్లు. లెక్కల సుధాకర్. పులిగిల్ల కనకయ్య. మహమ్మద్ ఖాజా మొయినుద్దీన్ ఉన్నారు