మానవ హక్కుల పరిరక్షణ సంస్థ మహబూబాబాద్ జిల్లా చైర్మన్ గా మాందాటి శ్రీనివాస్

మహబూబాబాద్ బ్యూరో-ఆగస్టు8(జనంసాక్షి)

మానవ హక్కుల పరిరక్షణ సంస్థ వ్యవస్థాపకులు జాతీయ అధ్యక్షులు సింగమాల వెంకటరమణయ్య ఆదేశాల మేరకు, తెలంగాణ స్టేట్ చైర్మన్ దబ్బేటి శ్రీనివాస్ మానుకోట జిల్లా కార్యాలయంలో ఏర్పాటుచేసిన ముక్యుల సమావేశంలో పాల్గొని, మహబూబాబాద్ జిల్లా చైర్మెన్ గా బయ్యారం మండలం గౌరారం గ్రామానికీ చెందిన మాందాటి శ్రీనివాస్ ను ప్రకటించారు. తాను పదవి బాధ్యతలు అప్పగించి సేవకార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, సంస్థ తరుపున న్యాయ పోరాటం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కార్యదర్శి ఎస్కె.రేష్మ, రాష్ట్ర కార్యదర్శి బెస్త సంజీవరావు, జిల్లా కార్యదర్శి ఏసుమల్ల రాజశేఖర్, సభ్యులు పోలేపాక కార్తీక్, మధు, దారావత్ సుమన్, వర్రే గణేష్, కేసోజు అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు