రైల్వై స్టేషన్ల వద్ద బ్రతికే చిరువ్యాపారులను ఇబ్బందులాపాలు చేయవద్దు -ఆర్పీఎఫ్ డీజీపీ ని కలిసిన మాలోత్ కవిత

మహబూబాబాద్ బ్యూరో-ఆగస్టు8(జనంసాక్షి)

రైల్వేస్టేషన్ లు ఆదారంగా జీవించే చిరువ్యాపారులను ఇబ్బంది పెట్టవద్దని, మానవతాదృక్పదంతో వారి పరిస్థితిని గుర్తించాలని, రైల్వేస్టేషన్ లను ఆదారంగా చేసుకుని వాటి పరిసరాలలో, చిరువ్యాపారాలు చేసుకుంటూ జీవించే పేదప్రజలను రైల్వేపోలీస్ లు ఇబ్బంది పెడుతున్నట్లుగా తనదృష్టికి వచ్చిందని, వారి కుటుంబాలను, పరిస్థితులను, ఆర్థిక స్థితిగతులను మానవతాదృక్పదంతో పరిశీలించాలని, వారిని ఇబ్బంది పెట్టడం మానుకోవాలని మహబూబాబాద్ యంపి మాలోత్ కవిత ఆర్ పిఎప్ డిజిపి మనోజ్ యాదవ్ ను ప్రత్యేకంగా డిల్లీలో కలిసి విజ్ఞప్తి చేసారు. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని మహబూబాబాద్, డోర్నకల్, కేసముద్రం, నెక్కొండ తదితర రైల్వేస్టేషన్ లను ఆదారం చేసుకుని వందలాది మంది నిరుపేదలు, ప్రధానంగా మహిళలు, గిరిజనులు చిరువ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారని యంపి కవిత వివరించారు. రైల్వేపోలీసులు వారిని ఇబ్బందులపాలు చేస్తున్నారని, దీంతో తమ కుటుంబాలు ఆకలితో అలమటించే పరిస్థితులు ఏర్పడ్డాయని పలువురు తనను కలిసి ఆవేదనతో వివరించారని యంపి కవిత, ఆర్పీఎప్ డిజిపి మనోజ్ యాదవ్ కు తెలిపారు. ఈ అంశాన్ని ప్రత్యేకమైనదిగా పరిశీలించి, మానవీయకోణంలో ఆలోచించి సంబందిత అధికారులకు తగు ఆదేశాలు ఇవ్వాలని వేలాది నిరుపేద కుటుంబాల తరుపున విజ్ఞప్తి చేస్తున్నట్లు యంపి మాలోత్ కవిత ఆర్పీఎప్ డిజిపి మనోజ్ యాదవ్ కు తెలిపారు.

తాజావార్తలు