Wednesday, 4 November 2026

మానాల అభయాంజనేయ ఆలయానికి రంగులు వేయించిన భక్తుడు

రుద్రంగి ఆగస్టు 28 (జనం సాక్షి)
మానాల అటవీ ప్రాంతంలో స్వయంభూగా వెలిసిన గండి అభయాంజనేయ స్వామి ఆలయానికి ఆదివారం టిఆర్ఎస్ నాయకులు వేములవాడకు చెందిన వ్యాపారి మాడిశెట్టి కృపాల్ శ్రావణమాసం సందర్భంగా ఆలయ గర్భగుడిలో మూలవిరాట్ ఆలయానికి రంగులు వేయించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… స్వయంభూగా వెలిసిన గండి అభయ ఆంజనేయస్వామి భక్తుల కోరికలు తీర్చే ఇలవేల్పని,శ్రావణమాసంలో పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వచ్చి ముక్కులు చెల్లిస్తారని అన్నారు. అలాగే రుద్రంగి మండల తీన్మార్ మల్లన్న సభ్యుడు గసికంటి అరుణ్ కలర్లు అద్దిన కార్మికులకు తన వంతు సహాయం అందించారు.