మామిళ్ల వారి గూడెంలో ఘనంగా మల్లు నందిని పుట్టినరోజు వేడుకలు..
అశ్వరావుపేట రూరల్, డిసెంబర్ 4 (జనం సాక్షి )
మధిర శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని పుట్టినరోజు వేడుకలు అశ్వరావుపేట మండలం మామిళ్ల వారి గూడెంలో ఆదివారం నాడు కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. ఓబిసి జిల్లా అధ్యక్షులు, ఓ బి సి మండల అధ్యక్షులు తుమ్మ రాంబాబు ఉప్పల రాజశేఖర్ లు కార్యకర్తలతో కలిసి కొత్త మామిళ్ల వారి గూడెం పాత వారి గూడెం కూడలిలో కేక్ కట్ చేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా తుమ్మ రాంబాబు మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో సుస్థిర పరిపాలన కొనసాగిందని పేద బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందించే విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా ఉందని తెలిపారు.అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు , సంక్షేమ పథకాలు సక్రమంగా అందాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జుజ్జూరు దుర్గారావు, కొప్పుల శ్రీను, వీర్నాల మహేశ్వరరావు, ఉప్పల వెంకటేశ్వరరావు, మండల కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు మొద్దు మరియమ్మ, నల్లపు జగన్,వగ్గేలా లక్ష్మణరావు, సత్యం రామకృష్ణ, ఆది ప్రసాద్,సింగలదేవి కనకం, వీర్నాల మహేశ్వరరావు, తురాబ్ తదితర కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.




