Tuesday, 3 November 2026

మారుతున్న తెలంగాణ రాజకీయాలు

బిజెపి కాంగ్రెస్‌ లను బలంగా ఢీకొనేలా కసరత్తు
అభివృద్ది కార్యక్రమాలను అదేస్థాయిలో ప్రచారం చేయడం
ప్రశాంత్‌ కిషోర్‌ ఎంటర్‌తో మారుతున్న వ్యూహాలు
హైదరాబాద్‌,మార్చి4(జనం సాక్షి): తెలంగాణ రాజకీయాల్లో ప్రశాంత్‌ కిశోర్‌ ఎంటర్‌ కావడంతో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఓ వైపు రాజకీయంగా బిజెపి,కాంగ్రెస్‌లను ఢీకొంటూనే..మరోవైపు తెలంగాణలో చేపట్టి అమలుచేస్తున్న పథకాలను ఏదో రూపంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అందుకే టిఆర్‌ఎస్‌ దూకుడుగా వ్యవహరిస్తోంది. బిజెపి విషయంలో అయితే ఈ దూకుడు తీవ్రంగా ఉంది. తాజాగా శ్రీనివాస్‌ గౌడ్హత్య కుట్రకోణంలోనూ ఇది కనిపిస్తోంది. ఇకపోతే ప్రధానంగా కార్యకర్తలను ఖాళీగా కూర్చోకుండా చేస్తున్నారు. ఇందులో భాగంగానేఇటీవల కెసిఆర్‌ బర్త్‌డేను మూడ్రోజుల పాటునిర్వహించారు. అనేక కార్యక్రమాలనుచేపట్టారు. ఊరూవాడా కెసిఆర్‌ నినాదాలు మార్మోగాయి. తాజాగా మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కూడా మూడ్రోజుల పాటు కార్యక్రమాలకు మంత్రి కెటిఆర్‌ పిలుపునిచ్చారు. మహిళల కోసం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ, సంరక్షణ పథకాలు రాష్ట్రంలో అద్భుతంగా అమలవుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబురాలకు టిఆర్‌ఎస్‌ పార్టీ సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా ’మహిళా బంధు కెసిఆర్‌’ పేరిట మూడు రోజుల పాటు ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలను నిర్వహించాలని పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో 6, 7, 8 తేదీల్లో మహిళా దినోత్సవ సంబురాలను వైభవంగా జరపాలని తలపెట్టింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహాక అధ్యక్షుడు, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్‌ గురువారం పార్టీ జిల్లా అధ్యక్షులు, శాసనసభ్యులతో ప్రత్యేకంగా టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 6వ తేదీన ముఖ్యమంత్రి కెసిఆర్‌కు రాఖీ కట్టడం ద్వారా ఈ ఉత్సవాలకు శ్రీకారం చుడదామని పార్టీ నేతలకు ఆయన సూచించారు. హిళల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం
చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పధకాలపై మరోసారి పెద్దఎత్తున ప్రచారం చేయాబోతున్నారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులు, డాక్టర్లు, ప్రతిభ కలిగిన విద్యార్థినిలు, ఆశా వర్కర్లు, ఎఎన్‌ఎంలు స్వయం సహాయక సంఘాల నాయకురాళ్లు తదితర మహిళలకు గౌరవ పూర్వక సన్మానం చేయనున్నారు. కెసిఆర్‌ కిట్‌, షాదీ ముబారక్‌ వంటి పథకాలు అమలు చేస్తున్నందుకు థాంక్యూ కెసిఆర్‌ ఆకారం వచ్చేలా మానవహారాలను పెద్దఎత్తున ఏర్పాటు చేయనున్నారు. 7వ తేదీన మహిళా సంక్షేమ కార్యక్రమాలు అయిన కల్యాణలక్ష్మి, కెసిఆర్‌ కిట్‌లు, ఇతర మహిళా సంక్షేమ కార్యక్రమాల లబ్దిదారులను నేరుగా ఇంటివద్దకెళ్లి కలవడం లబ్దిదారులతో సెల్ఫీలు తీసుకోవడం ద్వారా వారిని పకలరించబోతున్నారు. 8 తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున నియోజకవర్గ స్థాయిలో మహిళలతో సమావేశాలు నిర్వహించి, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించబోతున్నారు. గతంలో పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రైతుబంధు వారోత్సవాలతో పాటు కెసిఆర్‌ జన్మదిన వేడుకలకు మంచి స్పందనవచ్చింది. క్షేత్రస్థాయి సమస్యలకు కెసిఆర్‌ అద్భుతమైన పరిష్కారం చూపిస్తూ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను రూపకల్పన చేశారని ప్రజల్లో బలంగా నాటాలన్నదే ఈ కర్యక్రమ ఉద్దేశ్యంగాచూడాలి. అందులో భాగంగానే మహిళా సంక్షేమానికి సంబంధించి అపూర్వమైన కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందని గుర్తు చేయబోతున్నారు. ఆడబిడ్డలకు నీటి కష్టాలను దూరం చేసేందుకు మిషన్‌ భగీరథ పథకాన్ని అమలు చేసి, విజయవంతం చేశారన్నారు. మాతా శిశు సంరక్షణ కోసం కెసిఆర్‌ కిట్‌ పథకం అమలు చేశామన్నారు. ఈ పథకం అమలుతో మాతా శిశు మరణాలు తగ్గాయన్నారు. అదే సమయంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో సురక్షిత ప్రసవాలు పెరిగాయని ఈ సందర్భంగా కెటిఆర్‌ గుర్తు చేశారు. కల్యాణలక్ష్మి కార్యక్రమం ఒక గొప్ప మైలురాయిని చేరుకుందన్నారు. ఇప్పటిదాకా సుమారు 10 లక్షల 30 వేల మంది పేద ఇంటి ఆడబిడ్డలకు పెళ్లి చేసిన దేశంలోని తొలి ప్రభుత్వంగా టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం గుర్తింపు పొందిదన్నారు. ఇందులో భాగంగా లబ్దిదారులకు రూ. 9,022 కోట్లను పెళ్లి కానుకగా అందజేశామన్నారు. కెసిఆర్‌ కిట్టు ద్వారా ఇప్పటి దాకా సుమారు 11 లక్షల మందికి రూ. 1700 కోట్ల లబ్ది చేకూర్చామన్నారు. ఇందులో ఒక్కొక్కరికి రూ. 13 వేల మేరకు ప్రయోజనం కల్పించామన్నారు. అలాగే టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒంటరి మహిళలకు, బిడి కార్మికులకు ఆసరా పింఛన్లు ఇస్తున్నదన్నారు. వడ్డీ లేని రుణాలను స్వయం సహాయక సంఘాలకు అందిస్తున్నదని తెలిపారు. మహిళా సంరక్షణ కార్యక్రమాల్లో భాగంగా షీటీమ్స్‌, భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. బాలికలకు ప్రత్యేకంగా రెసిడెన్షియల్‌ పాఠశాలలు, జూనియర్‌, డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేయడం, 70 లక్షల హెల్త్‌, హైజిన్‌ కిట్లను విద్యార్థినులకు అందించడం వంటి కార్యక్రమాలను ప్రచారం చేయనున్నారు. రాజకీయ, పారిశ్రామిక రంగాలలోనూ మహిళల కోసం అనేక కార్యక్రమాలను చేపట్టామని కూడా ప్రచారం చేయడం ఈ మూడ్రోజుల కార్యక్రమ లక్ష్యంగా ఉంది.