మార్గదర్శినిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు..

మార్గదర్శినిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

ఇల్లందు అక్టోబర్ 12 (జనం సాక్షి న్యూస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో మార్గదర్శిని గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వర్తించారు.దసరా సెలవుల నేపథ్యంలో గురువారం హిందూ సాంప్రదాయాలకు, కట్టుబాట్లకు అనుగుణంగా విద్యార్థినిలు తెలుగుదనం ఉట్టిపడేలా సాంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మ ఆటపాటలతో అలరించారు. ముందుగా బతుకమ్మ వేడుకలను పాఠశాల డైరెక్టర్, మున్సిపల్ ఛైర్మెన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు,యాదగిరి రాంబాబు, ఆర్వపల్లి రాధాకృష్ణ ప్రారంభించి విద్యార్థినిలను ఆశీర్వదించారు.