హైదరాబాద్: ప్రమాద సంఘటనలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అపోలో ఆసుపత్రి హైదరాబాద్‌లో అవగాహన కార్యక్రమం చేపట్టింది. పబ్లిక్ గార్డెన్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొనసాగిన ఈ కార్యక్రమంలో అత్మవసర పరిస్థితుల్లో ఎలాంటి చర్యలు చేపట్టాలనే విషయాలపై వైద్య నిపుణులు వివరించారు. గుండె నొప్పి, రోడ్డు ప్రమాదం ,పక్షవాతం, డయాబెటిస్ వంటి అంశాలపై వివరించారు. ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తదితర అంశాలపై వైద్యులు వాకర్స్‌కు అవగాహన కల్పించారు.




