మావోయిస్టులకు సహకరించి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు.

– నీల్వాయి ఎస్సై నరేష్.
పోటో రైటప్: మావోయిస్టుల పోస్టర్లను అంటిస్తున్న పోలీసులు.
బెల్లంపల్లి, సెప్టెంబర్ 4, (జనంసాక్షి)
మావోయిస్టులకు సహకరించి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని బెల్లంపల్లి నియోజకవర్గంలోని నీల్వాయి ఎస్సై నరేష్ అన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం పోలీసు కమిషనరేట్ మంచిర్యాల జోన్ ఇంచార్జి డీసీపీ అఖిల్ మహాజన్, జైపూర్ ఏసీపీ నరేందర్ ఆదేశాల మేరకు చెన్నూరు రూరల్ సిఐ విద్యా సాగర్ ఆధ్వర్యంలో నీల్వాయి పొలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలలో మావోయిస్టు నేతల ఫొటోలతో ఉన్న రివార్డు వాల్ పోస్టర్లను ఆదివారం అంటించినట్లు ఆయన పేర్కొన్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇటీవల ఉమ్మడి అదిలాబాద్ అటవీ ప్రాంతాల్లో మావోయిస్ట్ లు సంచారిస్తున్నట్లు తెలిసిందని, కావున యువతీ, యువకులు మావోయిస్టు/తీవ్రవాద కార్యకలాపాలకు సహకరించి తమ భవిష్యత్తును నాశనం చేసుకోకూడదన్నారు. మావోయిస్టుల వలన ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఆకస్మిక వాహన తనిఖీలు, ఏరియా డామినేషన్స్, ఫెర్రీ పాయింట్స్ చెకింగ్స్, కల్వర్ట్ చెకింగ్ లు నిర్వహించడం జరుగుతుందని, మీ ప్రాంతంలో మావోయిస్టు దళ సభ్యులు, అపరిచిత వ్యక్తుల సమాచారం తెలిస్తే పోలీస్ స్టేషన్ లో తెలియజేయాలి లేదా డయల్ 100 కీ కాల్ చేసి తెలియజేయాలని కోరారు. తెలిపిన వారి వివరాలు రహస్యంగా ఉంచబడుతాయని వారికి తగిన బహుమతి ఇవ్వబడుతుందని గ్రామస్తులకు వివరించారు.