ఫుడ్ ఫెస్టివల్ ను ప్రారంభించిన ఏసిపి కిరణ్ కుమార్.కోటగిరి ఫిబ్రవరి 6 జనం సాక్షి:-కోటగిరి మండల కేంద్రంలోని జెడ్పి ఉన్నత పాఠశాలలో సోమవారం ఫుడ్ ఫెస్టివల్ ను ఏర్పాటు చేశారు. ఈ ఫెస్టివల్ కార్యక్రమానికి బోధన్ ఏసిపి కిరణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.ఈ సందర్భంగా చిన్నారులు చేసిన వంటకాలు పాఠశాల ఆవరణ మంతా గుమగుమలాడాయి.ఈ సందర్భంగా ఏసిపి కిరణ్ కుమార్ పాఠశాల యాజమాన్యంతో కలిసి పాఠశాల ఆవరణంలో విద్యార్థులు తయారు చేసిన వివిధ రకాల వంటలను పరిశీలిస్తు,రుచి చూస్తూ చిన్నారులతో ముచ్చటించారు. అదేవిధంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన గేమ్ షోలో ఆయన పాల్గొని చిన్నారులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.విద్యార్థులకు చిన్నతనంలోనే అన్ని రంగాల లో ప్రావీణ్యం చెందేలా విద్యా సంస్థలు కృషి చేయాలన్నారు. విద్యార్థుల చేత ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించడం ఎంతో గర్వకారణమని పాఠశాల యాజమాన్యానికి ఆయన అభినందించారు.ఈ కార్యక్రమంలో ప్రధానో పాధ్యాయులు గాల్లప్ప,ఎస్సై మచ్చేంధర్ రెడ్డి,పాఠశాల ఉపాధ్యాయులు,సిబ్బంది, విద్యార్థిని,విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.




