హైదరాబాద్,మే18(జనం సాక్షి ): కర్ణాటకలో బల నిరూపణ కోసం భారతీయ జనతా పార్టీ ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో బేరసారాలు జరుపుతోందంటూ ఆరోపణలు వెల్లువెత్తున్న నేపథ్యంలో జనతా దళ్ సెక్యులర్ (జేడీఎస్) స్పందించింది. తన ఎమ్మెల్యేలంతా తమతోనే ఉన్నారని, డబ్బు, ఇతర పదవులకు వారెవరెరూ ఆశపడే ప్రసక్తే లేదని తెల్చిచెప్పింది. ‘రూ.100 కోట్లు కావచ్చు…రూ.200 కోట్లు కావచ్చు. మా ఎమ్మెల్యేలు మాతోనే ఉన్నారు. వారెవరూ ఎలాంటి ఆశలకు లొంగే ప్రసక్తే లేదు’ అని జేడీఎస్ ఎమ్మెల్యే జీటీ దేవెగౌడ విూడియాకు తెలిపారు. శుక్రవారం ఉదయమే హైదరాబాద్ వచ్చిన కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు శనివారం నాటికి బెంగళూరు తిరిగి వెళ్తారని ఆయన చెప్పారు. గందరగోళ పరిస్థితుల మధ్య యడ్యూరప్ప సర్కార్ ఏర్పాటు కావడం, 24 గంటల్లో బలనిరూపణ చేసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో పార్క్ హయత్ ¬టల్‌లో ఉంచిన కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెలను హైదరాబాద్‌లోని పార్క్ హయత్ ¬టల్‌కు తరలించారు. శనివారం సాయంత్రం 4 గంటలకు యడ్యూరప్ప బలనిరూపణ సమయానికి ఎమ్మెల్యేలంతా అక్కడకు చేరుకుంటారు. అంతకుముందు, సీక్రెట్ బ్యాలెట్ నిర్వహించాలంటూ బీజేపీ తరఫున మాజీ అట్నారీ జనరల్ చేసిన వాదనను సుప్రీంకోర్టు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చుతూ…ఎమ్మెల్యేలు తమ చేతులు పైకి ఎత్తడం ద్వారా మద్దతు తెలియజేయాలని, ఎమ్మెల్యేల సంఖ్యను స్పీకర్ లెక్కించాలని తీర్పు చెప్పింది.
———




