Friday, 6 November 2026

సుప్రీం తీర్పు బిజెపికి చెంపపెట్టు

హైదరాబాద్‌,మే18(జ‌నం సాక్షి ):  కర్ణాటక వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పు బీజేపీకి చెంపపెట్టు అని తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భట్టివిక్రమార్క అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్య పరిరక్షణకు ఉపయోగపడుతుందన్నారు. హైదరాబాద్‌లో ధర్నా సందర్భంగా శుక్రవారం విూడియాతో మాట్లాడిన భట్టి విక్రమార్క.. బీజేపీ అనైతిక పద్ధతులను కట్టడి చేస్తామన్నారు. కర్ణాటక అసెంబ్లీ బలనిరూపణలో బీజేపీ ఓటమి ఖాయం అన్నారు. అసెంబ్లీలో బీజేపీ రహస్య ఓటింగ్‌ అడగటం సిగ్గుచేటు అని బీజేపీ తీరుపై నిప్పులుచెరిగారు. కర్ణాటకలో బీజేపీ ప్రజాస్వామ్యన్ని అపహాస్యం చేసిందని మల్లు మండిపడ్డారు. కర్ణాటక గవర్నర్‌ వ్యవహారంపై సేవ్‌ డెమొక్రసీ పేరుతో గన్‌పార్క్‌ వద్ద కాంగ్రెస్‌ చేపట్టి నిరసన ప్రదర్శనలో భట్టి పాల్గొన్నారు. కర్ణాటకలో తక్షణం బలమైన కూటమిగా ఉన్న జేడీఎస్‌-కాంగ్రెస్‌ కూటమికి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని భట్టి విక్రమార్క డిమాండ్‌ చేశారు.
——