Friday, 6 November 2026

మా ఎమ్మెల్యేలందరూ మాతోనే ఉన్నారు: కాంగ్రెస్‌

హైదరాబాద్‌,మే16(జ‌నం సాక్షి ): తమ ఎమ్మెల్యేలందరూ తమతో టచ్‌లోనే ఉన్నారని కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు పరమేశ్వరన్‌ తెలిపారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను హైదరాబాద్‌ క్యాంప్‌కు తరలించారు. ఇక్కడి తాజ్‌ కృష్ణాలో వారికి వసతి కల్పించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ వద్ద ఆయన విూడియాతో మాట్లాడుతూ.. కొందరు ఎమ్మెల్యేలు కనిపించడం లేదంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. కర్ణాటకలో పూర్తి మెజారిటీ నిరూపించుకుని అధికారం చేపడతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సుప్రిం కోర్టు తీర్పు హర్షించదగ్గ విషయమని, తమకు న్యాయ స్థానంపై నమ్మక ముందని అందుకే న్యాయ స్థానాలను ఆశ్రయించామన్నారు. శనివారం జరిగే బలపరీక్షలో తమ బలాన్ని నిరూపించుకుంటామన్నారు.