జాతీయ పార్టీలపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లింది

– ఆపార్టీలకు పూర్తి మెజార్టీ ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా లేరు
– రైతుబంధుతో దేశం మొత్తం తెలంగాణవైపు చూస్తుంది
– రైతులకు అన్నివిధాల కేసీఆర్‌ అండగా నిలుస్తున్నారు
– డీఎస్‌కు తెరాసలో ఎలాంటి ఇబ్బంది లేదు
– క్యాడర్‌లో అసంతృప్తి ఉంటే సమన్వయం చేసుకుంటాం
– నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత
నిజామాబాద్‌, మే16(జ‌నం సాక్షి ): కర్టాటక ప్రజలు ఇచ్చిన తీర్పు మాత్రం జాతీయ పార్టీలపై విశ్వాసం లేదనే అర్థం అవుతుందని టీఆర్‌ఎస్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. శుక్రవారం ఉదయం ఆమె విూడియాతో మాట్లాడుతూ.. కర్టాటకలో ఏ పార్టీకి ఓటు వేయాలో అర్ధం కాని కన్ఫ్యూజన్‌ ప్రజల్లో ఏర్పడిందన్నారు. జాతీయ పార్టీలకు సంపూర్ణ మెజారిటీ ఇచ్చే పరిస్థితుల్లో ప్రజలు లేరని ఆమె తెలిపారు. ప్రస్తుతం దేశం మొత్తం ఇదే పరిస్థితి ఉంది. సీఎం కేసీఆర్‌ కూడా ఇదే చెబుతున్నారని, సీఎంగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం నేపథ్యంలో బీజేపీ ఈ అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటుందో చూడాలన్నారు. వారం అయితే తప్ప ఏం జరుగుతుందో చెప్పలేమని ఎంపీ తెలిపారు. కాంగ్రెస్‌ నుంచి వచ్చిన డీఎస్‌ శ్రీనివాసులుకి టీఆర్‌ఎస్‌ సముచిత గౌరవం ఇచ్చిందని, ఆయనకు టీఆర్‌ఎస్‌లో చాలా ఫ్రీడం ఉందన్నారు. ఏవిధమైన ఇబ్బంది లేదని, కానీ డీఎస్‌ ఆనుచరులు అసంతృప్తి ఉన్నట్లు తెలిసిందన్నారు. త్వరలోనే సమన్వయం  చేసుకుంటామన్నారు. అంతేకాక జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. రైతులకు రైతుబంధు పథకంలో ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా సీఎం కేసీఆర్‌ నగదు ఏర్పాటు చేయించారని, దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో భూ రికార్డుల ప్రక్షాళన జరుగుతోందని కవిత పేర్కొన్నారు. అంతేకాక క్రీడాకారులకు కూడా ప్రోత్సాహం ఇస్తున్నామన్నారు. ఎక్కడా లేని విధంగా సీఎం రైతులకు ఐదు లక్షల ఇన్సూరెన్స్‌ను ప్రకటించారన్నారు. ఎర్రజొన్న రైతులకు మంచి ధర కల్పించి కొనుగోలు చేశామని తెలిపారు. నీటి పారుదల, రైతు, వ్యవసాయం ఈ మూడు అంశాలకు టీఆర్‌ఎస్‌ అధిక ప్రాధాన్యం ఇచ్చిందని ఎంపీ కవిత తెలిపారు.