Wednesday, 4 November 2026

మా ఓట్లతోనే విూకు ..

ఐదు సీట్లు వచ్చాయన్నది మర్చిపోకండి
– తెలుగు ప్రజలకు బీజేపీ వెన్నుపోటు పొడిచింది
– తెదేపా సీనియర్‌ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి
హైదరాబాద్‌, జులై7(జ‌నం సాక్షి) : తెలుగుదేశం పార్టీ ఓట్లతోనే తెలంగాణలో బీజేపీకి ఐదు సీట్లు వచ్చాయన్న సంగతిని ఆ పార్టీ నేతలు మర్చిపోవద్దని టీడీపీ సీనియర్‌ నేత రావుల చంద్రశేఖర్‌ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… తెలుగు ప్రజలకు బీజేపీ వెన్నుపోటు పొడిచిందని, కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు బీజేపీ రాజకీయం ప్రజలు గమనిస్తున్నారన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, బీజేపీ పాలనలో ఆర్థిక నేరాల పెరిగాయని, బ్యాంక్‌ కుంభకోణాలు ఎప్పుడు ఏది బయటపడుతుందో చెప్పలేకుండా ఉందన్నారు. అలాగే కేంద్రం స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులు పరిగణలోకి తీసుకోకుండా మద్దతు ధర పెంచిందని రావుల అన్నారు. రాజకీయాల్లో బీజేపీ, టీఆర్‌ఎస్‌ అనాగరిక భాషను మానుకోవాలని చంద్రశేఖర్‌ రెడ్డి అన్నారు. కేంద్ర, రాష్ట్రాల్లో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని, రెండు ప్రభుత్వాలు కేవలం లెక్కల్లోనే అభివృద్ధి చూపుతూ క్షేత్రస్థాయిలో చూపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అవినీతి అక్రమాలు ఎక్కువయ్యాయన్నారు. ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్‌ కుటుంబం కోట్లు దండుకుంటుందని ఆరోపించారు. రాబోయే కాలంలో కేసీఆర్‌ ప్రభుత్వానికి గుణపాఠం
చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని రావుల హెచ్చరించారు.