మా తల్లి మరణం పై మాకు అనుమానం ఉంది
స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు 18 , ( జనం సాక్షి) :
మాతల్లి గట్టు లక్ష్మి మరణంపై మాకు అనుమానం ఉందని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి తమకు న్యాయం చేయాలని డాక్టర్ గట్టు కరుణాశ్రీ, గట్టు అరుణశ్రీ, గట్టు వాణిశ్రీ కోరారు.ఈ విషయమై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ మా ముగ్గురు అక్కా చెల్లెల్లతో పాటు మాకు ఇద్దరు సోదరులు గట్టు మహేందర్,గట్టు నరేందర్ ఉన్నారు.మాసోదరులు ఇద్దరుఏనాడు మాఅమ్మ ను పట్టించుకోలేదు.గత మూడుసంవత్సరాలుగా మా అమ్మ ను మా దగ్గరనే ఉంచుకుని సేవ చేసా మన్నారు.మా తల్లికి గత కొద్ది రోజుల క్రితం ఆరో గ్యం బాగా లేదని హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్ప త్రిలో చికిత్స చేయించాము.ఈ నెల 15వ తేదిన స్టేషన్ ఘనపూర్ లో ఉన్న మా తల్లిగారి ఇంటికి తీసుకు వచ్చామని అన్నారు. బుధవారం అనగా 17న మద్యాహ్నం మా సోదరుడు గట్టు మహేంద ర్ ఇంటికివచ్చి మమ్మల్ని కొట్టి ఇంట్లోనుంచి బయ టకు నెట్టి వేసారు. వెంటనే 100 కు డయల్ చేయ గా పోలీసులు వచ్చారని మా అమ్మ ను చూసుకో వడం కోసం మమ్మల్ని ఆ ఇంట్లో ఉండేల చూడాల ని వారితో మేము కోరగా వారు పట్టించుకోకుండా వెళ్లి పోయారు అని అన్నారు. మేము పోలీస్ స్టేష న్ కు వెళ్ళి చెప్పిన వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని అన్నారు.చేసేది ఏమీలేక వెళ్లి పోయమ ని, గురువారం ఉదయం మీ అమ్మ చనిపోయరని పక్కింటి వాళ్ళు సమాచారంఇవ్వగా మేము వచ్చి మాఅమ్మ సాదారనంగా మరణింనట్లు లేదనేఅను మానంతో పిర్యాదు చేయడం జరిగింది అని, న్యాయం చేయాలని కోరారు.
|