Tuesday, 3 November 2026

మిగులు రాష్ట్రమంటూనే పన్నులా? : కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌, మార్చి 31 : తెలంగాణ మిగులు రాష్ట్రమంటూనే ప్రజలపై మోయలేనంతగా పన్నుల భారం మోపుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చే వాహనాలపై పన్ను విషయంలో ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుందన్నారు. మరో ఏడాదిపాటు ఏపీ వాహనాలకు పన్ను మినహాయింపు ఇవ్వాల్సిందన్నారు. మిగులు రాష్ట్రమంటూనే పన్నుల భారం వేస్తున్నారని ఆరోపించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలను వెంటనే నిర్వహించాలని కిషన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *