Tuesday, 3 November 2026

మినీ లారీ బీభత్సం

ఒకరి మృతి.. పోలీసుల అదుపులో డ్రైవర్‌
హైదరాబాద్‌్‌, ఆగస్టు 9 (జనంసాక్షి):బోరబండ కార్మికనగర్‌లో మినీ లారీ బీభత్సం సృష్టించింది. గురువారం ఉదయం బోరబండ కార్మికనగర్‌లో ప్రయాణిస్తున్న మినీ లారీ అదుపుతప్పి సమీపంలోని ఆటో స్టాండ్‌లోకి దూసుకుపోయింది. దీంతో మూడు ఆటోలు ధ్వంసమయ్యాయి. శేఖర్‌ అనే వికలాంగుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. జరిగిన సంఘటనకు ఆగ్రహించిన స్థానికులు లారీ డ్రైవర్‌ను, యజమానిని పోలీసులకు అప్పగించారు. మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్‌ చేశారు. ఇదిలా ఉండగా, మినీలారీ బ్రేకులు ఫెయిల్‌ కావడంవల్లే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *