మిర్యాలగూడ జిల్లా ఏర్పాటుకు.. ప్రస్తుత ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు సహకరించాలి..
బీసీ నేత ధనుంజయ నాయుడు విజ్ఞప్తి
నేరేడుచర్ల( జనంసాక్షి)న్యూస్.జిల్లాగా ఏర్పాటు కోసం అన్ని అర్హతలు కలిగిన మిర్యాలగూడకు జిల్లా జిల్లా హోదా కలిగించేందుకు ప్రస్తుత ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు చిత్తశుద్ధితో సహకరించాలని బీసీ హక్కుల సాధన సమితి సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు విజ్ఞప్తి చేశారు. సోమవారనాడు ఆయన నేరేడుచర్ల లో పాత్రికేయులతో మాట్లాడుతూ.హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు,మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి,సాగర్, మాజీఎమ్మెల్యే కుందూరు జానారెడ్డి లు మిర్యాలగూడ జిల్లా ఏర్పాటుకు పూర్తి సహకారం అందిస్తే మిర్యాలగూడ జిల్లా సాధించడం ఏవంత కష్టమైన పని కాదని, మిర్యాలగూడ పూర్తి నియోజక వర్గం,సాగర్ పూర్తి నియోజకవర్గంలో పాటు, హుజూర్నగర్ నియోజకవర్గం లోని కొంత భాగాన్ని కలిపి నూతన జిల్లాగా ఏర్పాటు చేయాలని, అందుకు సకల జనులు ఉద్యమంలోకి రావాలని,ప్రజలు తలుచుకుంటే ఏదైనా సాధ్యమన్న విషయం చరిత్ర చెబుతున్న సత్యం అని,మిర్యాలగూడ జిల్లాగా ఏర్పడితే,ప్రజలకు ఎంతో సౌకర్యకరంగా ఉంటుందని, వ్యవసాయపరంగా, వాణిజ్యపరంగా, వనరుల పరంగా, పారిశ్రామికంగా అన్ని రకాల ప్రయాణ సదుపాయాలు కలిగి ఉన్న మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు ఆవశ్యకత ఎంతైనా ఉందని, అందుకు చైతన్యవంతమైన యువత, నిస్వార్థపూరితమైన రాజకీయ నాయకులు ముందుకు వచ్చి జిల్లా నిర్మాణం కొరకు అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని బలమైన ఉద్యమం నిర్మిస్తే మిర్యాలగూడ జిల్లా కల సాకారం అవుతుందని అందుకు ఇటీవల కాలంలో ఏర్పడ్డ ములుగు జిల్లాతో పాటు,గట్టుప్పల్ మండల ఏర్పాటు మచ్చుతునక అని ఆయన అన్నారు