బోనమెత్తి మొక్కిన సమితి నేతలు
నేతల్లో మార్పు రావాలని చర్చి లో ప్రార్థన.
మిర్యాలగూడ. జనం సాక్షి
మిర్యాలగూడ కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని పాలకుల్లో మార్పు రావాలని కోరుతూ మిర్యాలగూడ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఆదివారం మిర్యాలగూడ పట్టణంలోని చర్చిబజార్ చర్చిలో క్రిస్టియన్ సోదరులతో ప్రార్థనలు చేయగా, గాంధీనగర్ కలాల్ వాడలో ముత్యాలమ్మ కు మిర్యాలగూడ జిల్లా సాధన సమితి కన్వీనర్ డాక్టర్ రాజు కో కన్వీనర్ మాలోతు దశరథ నాయక్ లు బోనాలు సమర్పించి వేడుకున్నారు. ఈ సందర్భంగా ఫాస్టర్ జోజి చెన్నప్ప సిస్టర్ రాణి ఈన్నాసియా,జయసింహ,అంతోనిలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మిర్యాలగూడ జిల్లా ఏర్పాటుకు ముఖ్యమంత్రి,జిల్లామంత్రి,శాసన సభ్యులు నిర్ణయం తీసుకునేలా ప్రార్ధించారు. జిల్లా ఏర్పాటు ఆకాంక్ష ప్రజలందరిదని, క్రిస్టియన్ సోదరులు స్వచ్ఛందంగా ఉద్యమానికి మద్దతు తెలుపుతారని అన్నారు. జిల్లా ఏర్పాటు విషయంలో ప్రజల్లో చైతన్యం రావాలని, ఉద్యమించడం ద్వారా జిల్లాను సాధించుకోవాలని ముత్యాలమ్మ గుడి వద్ద జరిగిన కార్యక్రమంలో పలువురు సూచించారు. పాలక పక్షాలు ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలని జిల్లా ఏర్పాటు ఆకాంక్ష ను నెరవేర్చాలని సూచించారు. కార్యక్రమంలో న్యాయవాది లింగంపల్లి శ్రీనివాస్, తాళ్లపల్లి రాములు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి, యాదవ సంఘం డివిజన్ ప్రధాన కార్యదర్శి చేగొండి మురళి యాదవ్, బీసీ సంఘం పట్టణ అధ్యక్షులు బంటు వెంకటేశ్వర్లు, సామాజిక తెలంగాణ ప్రధాన కార్యదర్శి జయరాజు ఎంపీటీసీల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి బెజ్జం సాయి, నగేష్ ముత్యాలమ్మ దేవాలయం పూజారులు కొంక శ్రీను,నక్క బిక్షం,కోడి రెక్క మట్టయ్య, శౌరి, బోర మట్టయ్య, పెరుమాళ్ళ జ్ఞానయ్య, కోడిరెక్క మల్లయ్య, కోడి రెక్క నరసయ్య, కోడి రెక్క రాజేందర్, తాళ్లపల్లి నాగయ్య, పోకబత్తిని ఆంటోనీ, గండమల్ల శ్యామ్, తిరుమలేష్,రవి తదితరులు పాల్గొన్నారు




