ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు చేసిన పిల్లుట్ల రఘు
హుజూర్ నగర్ ఆగస్టు 21 (జనం సాక్షి): హుజూర్ నగర్ పట్టణంలో గ్రామదేవత అమ్మవారిని అంగరంగ వైభవంగా 3 రోజుల పాటు పూజించే అతిపెద్ద జాతర ముత్యాలమ్మ జాతర ఉత్సవంలో భాగంగా మొదటి రోజు ఆదివారం పెద్ద ముత్యాలమ్మ జాతర సందర్భంగా ఓజో ఫౌండేషన్ అధినేత పిల్లుట్ల రఘు ముత్యాలమ్మ గుడిలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓజో అధినేత రఘు మాట్లాడుతూ హుజూర్ నగర్ పట్టణ, పరిసర
ప్రజలు అతిగొప్పగా జరుపుకునే గ్రామ దేవత పండుగ ముత్యాలమ్మ తల్లి జాతరని ఆ తల్లి ఆశీస్సులతో
ప్రజలందరూ ఆయురారోగ్యాలతో పాడి పంటలతో పిల్లాపాపలతో సంతోషంగా ఉండాలని ప్రజలు ముత్యాలమ్మ పండుగను ఆనందోత్సవాలతో జరుపుకోవాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ముత్యాలమ్మ పండుగ అనగానే హుజూర్ నగర్ ప్రాంత ప్రజల మనస్సులు పులకరిస్తాయని ఆయా ప్రాంతాల ప్రజలు బంధుమిత్రుల కుటుంబాలతో కలిసి మెలిసి ఈ పండుగ జరుపుకుంటారన్నారు. గ్రామీణ వాతావరణంలో నివసించే కుటుంబాల్లో బంధాలను అనుబంధాలను పెంపొందించే పండుగ ముత్యాలమ్మ జాతరని అన్నారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ ఓజో ఫౌండేషన్ ఇంచార్జ్ కుక్కల వెంకన్న ఓజో ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.