మిలాద్ ఉన్ నబీ సందర్భంగా రక్తదాన శిబిరం.

జనం సాక్షి ఉట్నూర్.

మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా శనివారం పుట్టినూరు పట్టణంలో అంబేద్కర్ చౌక్ వద్ద ముస్లిం జేఏసీ మరియు యూత్ ఆధ్వర్యంలో మిలాద్ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.ఈ శిబిరం ఉట్నూర్ సిఐ సైదారావు ముస్లిం జేఏసీ చైర్మన్ అంజత్ మొయినుద్దీన్ తో కలిసి శిబిరాన్ని ప్రారంభించారు.అనంతరం సీఐ సైదారావు మాట్లాడుతూ ప్రజల్లో చైతన్యం కొరకు ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగాలని ఆపదలో ఉన్నవారికి ఎంతోమందికి మేలు జరుగుతుందని ఏజెన్సీ ప్రాంతాల్లో ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేయాలన్నారు. ఉటునూరు పట్టణంలో 35 మంది యువకులు ముందుకు వచ్చి రక్తదానం చేయడం గర్వకారణంగా ఉందని అన్నారు. అదేవిధంగా రక్తదాతలకు మరియు ఈ కార్యక్రమం నిర్వాహకులకు ముస్లిం జేఏసీ సభ్యులకు యూత్ సభ్యులకు అభినందించారు. డాక్టర్ భీంరావ్ ఎస్ఐ భారత్ సుమన్ మౌలానా రిజ్వాన్ ముస్లిం జేఏసీ ప్రధాన కార్యదర్శి జవ్వాద్ అన్సారీ మండల కో ఆప్షన్ సభ్యుడు సయ్యద్ రషీద్ మాజీ జడ్పిటిసి వాగు మారే జగ్జీవన్ ఉట్నూర్ మాజీ సర్పంచ్ బొంత ఆశ రెడ్డి రైతుబంధు మండల అధ్యక్షుడు అహ్మద్ అజముద్దీన్ షాపూర్ మండల సాధన సమితి చైర్మన్ మరప బాజీరావు తెరాస జిల్లా నాయకులు కాటం రమేష్ సభ్యులు యూత్ సభ్యులు ఆమేర్ మోసిన్ అబ్రార్ జుబేర్ ఖాన్ సలావుద్దీన్ తదితరులు ఉన్నారు.