*మునుగోడులో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం- కాంగ్రెస్ పార్టీ శంషాబాద్ అధ్యక్షుడు,కౌన్సిలర్ సంజయ్ యాదవ్*
మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి మద్దతుగా నియోజకవర్గంలోని కల్వకుంట్ల గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సంజయ్ యాదవ్.
ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాట నుంచి ఇప్పటివరకు టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని అన్నారు. ప్రజలను మభ్య పెట్టడానికి ఇప్పటికీ ఉచిత హామీలు ఎన్నో ఇస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతుందన్నారు. మునుగోడు నియోజకవర్గంలో ఏ గ్రామంలో చూసినా ఎక్కడ అభివృద్ధి కనిపించడం లేదని,గ్రామాలలో రోడ్లు, డ్రైనేజీలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే టిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకోవడం విడ్డూరమన్నారు. ప్రజలలో టిఆర్ఎస్ ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ పై నమ్మకం పోయిందని మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుస్తుంది అన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు మేక ప్రదీప్ రెడ్డి, హన్మంతు, గోవర్ధన్ రెడ్డి, చందు యాదవ్, అంక్రితాయ్,బంటి యాదవ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్ : మునుగోడు ఉప ఎన్నికలలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంజయ్ యాదవ్.