హైదరాబాద్,ఫిబ్రవరి16(జనంసాక్షి ): సచివాలయంలో మిషన్ కాకతీయపై నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా జిల్లాల అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిషన్ కాకతీయ పనుల పురోగతిపై చర్చించారు. మిషన్ కాకతీయ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇప్పటికే మంత్రి హరీష్‌రావు జిల్లాల్లో పర్యటించి మిషన్ కాకతీయ పనులను పర్యవేక్షించారు. అలాగే టెండర్లు వేసిన కాంట్రాక్టర్లకు పనులు అప్పగించే కార్యక్రమాలను సవిూక్షించారు. చెరువుల పూడికతీత కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టాలని, మట్టిని పొలాలలకు తరలించేలా ముందే చర్యలు తీసుకోవాలన్నారు. గుర్తించిన చెరువల్లో మట్టితీత, తరలింపు పక్కాగా సాగాలన్నారు. ఇది ప్రభుత్వం అత్యంత పక్కగా చేపడుతున్న కార్యక్రమమని అన్నారు.




