హైదరాబాద్,ఫిబ్రవరి16(జనంసాక్షి ): అటవీశాఖపై ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్‌పై సవిూక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి అటవీశాఖ మంత్రి జోగు రామన్నతో పాటు, ఆ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. తెలంగాణ రాష్టాన్న్రి సీఎం కేసీఆర్ హరిత వనం చేయాలని సూచించిన సందర్భంగా ఈ దఫా ఆ శాఖకు భారీ బడ్జెట్ కేటాయించాలని అధికారులు నివేదికలు సమర్పించారు. ఉద్యోగులకు వాహానాలు, ప్లాంటేషన్ల నిర్వహణకు నిధులు కేటాయించాలని అధికారులు సవిూక్షలో కోరారు. అలాగే అడవుల రక్షణకు చర్యలు తీసుకుంటున్న సందర్భంగా నిధుల కేటాయంపు పెరగాలని సూచించారు. దీంతో సాధ్యాసాధ్యాలపై ఇరుమంత్రులు,అధికారులు చర్చించారు.




