హైదరాబాద్: ప్రధాని పర్యటన కవరేజ్‌కు వెళ్లిన కొన్ని మీడియా సంస్థలపై వివక్ష చూపడం మంచిదికాదని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. లా అండ్ ఆర్డర్ సమస్య ఉంటే పోలీసులు చూసుకుంటారు కదా అన్ని చెప్పారు. పోలీసు అధికారులతో మాట్లాడి జర్నటిస్టులను తిరస్కరించిన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పానని తెలియజేశారు. నామినేట్‌డ్ పోస్టుల భర్తీపై కసరత్తు జరుగుతోందని చెప్పారు. ప్రతి జిల్లా నుంచి ఒకరికి అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తున్నామని తెలియజేశారు.




