Tuesday, 3 November 2026

మీరు నాటేస్తే మేం వేటేస్తాం!

(జనంసాక్షి) జూలై 22:
హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటుతున్న చెట్లు కేవలం అంకెలుగానే మిగిలిపోతున్నాయి.పలుచోట్ల పెట్టిన మొక్కలకు సంరక్షణ లేక చచ్చిపోతున్నాయి. మరికొన్నిచోట్ల విద్యుత్ తీగల కింద మొక్కలు నాటుతూ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని అదే పదను చూసుకొనిఅల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం డివిజన్ పరిధిలో గృహ నిర్మాణాలు చేపట్టి అమ్మే వ్యాపారం జోరుగా కొనసాగుతున్నందున డివిజన్ లోని కొన్నికాలనీలలోమేస్త్రీలు,బిల్డర్లునూతనంగాగృహనిర్మాణాలుచేపడుతున్నారు.కాలనీలలో చెట్లను నరికేస్తూ రోడ్డుపైనే ఇసుక కంకర కుప్పలు కాలనీ వాళ్లకు అంతరాయం కలిగిస్తున్నారని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేశారు.ఇందులో భాగంగా భాగ్యనగర్ కాలనీలో గృహ నిర్మాణాలు చేపడుతున్న బిల్డర్లు మేస్త్రీలు చెట్లను నరికేస్తూరెచ్చిపోతున్నారనికాలనీవాసులుఆరోపించారు.భాగ్యనగర్ కాలనీలో బుధవారం సిసి రోడ్లు ప్రారంభించడానికి వచ్చిన ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ కు కాలనీవాసులు ఫిర్యాదు చేశారు. కాలనీలోని రోడ్ల కిరువైపుల హరితహారం లో నాటి ఉన్న చెట్లను తొలగించి రోడ్డు నాక్రమిస్తూ నిర్మాణాలు చేపడుతున్నారని.వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేను కార్పొరేటర్ ను కోరారు. చెట్లు నరకవద్దని బిల్డర్లను కోరగా.వారిని బెదిరిస్తూ మా ఇష్టం ఏమైనా చేసుకుంటామ్ ఏం చేసుకుంటారో చేసుకోండి అని బెదిరించినట్లు కాలనీ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.దీనిపైఫిర్యాదుఎవరికిచేయాలోఎవరికితెలిపాలోతెలియకఎమ్మెల్యేకువిన్నవించుకుంటున్నామని తెలిపారు. సంబంధిత అధికారులు, ఎమ్మెల్యే, కార్పొరేటర్ లు చర్యలు తీసుకొని సమస్య పరిష్కరించాలని కోరారు.
Attachments area