సామాన్యుడి నడ్డి విరుస్తున్న బీజేపీ ప్రభుత్వం
ఫోటో : సమావేశంలో మాట్లాడుతున్న టీఆర్ఎస్వీ నాయకులు..
సిద్దిపేట అర్బన్, జూలై 22(జనం సాక్షి):
అన్ని ధరలను పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తున్న బిజెపి ప్రభుత్వం కల్లబొల్లి కబుర్లు చెబుతోందని టిఆర్ఎస్వి ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు నాగుల ప్రశాంత్ అన్నారు. శుక్రవారం సిద్దిపేట అర్బన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి లో సిద్దిపేట దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఇక్కడకు వచ్చి టీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తే సహించేది లేదని అన్నారు. అంబేద్కర్ చౌరస్తాలో సమావేశం ఏర్పాటు చేసి కనీసం అంబేద్కర్ విగ్రహానికి నివాళి అర్పించలేక పోవడం బీజేపీ పార్టీ నీచ సంస్కృతికి నిదర్శనమని మండిపడ్డారు. భరోసా యాత్ర చేయాల్సింది తెలంగాణ రాష్ట్రంలో కాదని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చేయాల్సిన ఉందన్నారు. రాష్ట్రానికి నిధులు తేలేని అసమర్థ నాయకులు బీజేపీ వాళ్లని ఇంకా యాత్రలు చేయడం సిగ్గుచేటన్నారు. అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి సామాన్య ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం నిత్యావసర సరుకుల ధరలు అధికంగా పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తుందన్నారు. యాత్రలు మానుకొని ఇకనైనా ప్రజలకు మేలు చేసే విధంగా ధరలు తగ్గించి ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు స్వామి, శ్రీకాంత్, మల్లేష్, మహేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
Attachments area