మీసేవ కేంద్రాలలో బయోమెట్రిక్ లోపాలను తక్షణమే సరిచేయాలి – జిల్లా అధ్యక్షులు చిలువేరు స్వామి
జనంసాక్షి , రామగిరి : కార్మిక శాఖ లేబర్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన బయోమెట్రిక్ విధానం అమలు చేయడంతో భవన నిర్మాణ కార్మికులు తమ లేబర్ కార్డులను అప్లై చేసుకునేందుకు మీసేవ కేంద్రాలకు వెళ్ళగా బయోమెట్రిక్ లోపాలతో వేలిముద్రలు పడక గత నెల రోజుల నుండి మీసేవ కేంద్రాల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారని… వెంటనే ఆ సమస్యను పరిష్కరించాలని, భవన నిర్మాణ రంగాల కార్మికుల సమైక్య సంఘం జిల్లా అధ్యక్షులు చిలువేరు స్వామి కోరారు. మీసేవ కేంద్రాలలో అప్లై చేసుకునేందుకు వెళితే లేబర్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన సైట్ పనిచేయడం లేదని మీసేవ నిర్వాహకులు చెప్తున్నారన్నారు. మీ సేవా కేంద్రాలలో కొన్ని కంపెనీలకు సంబంధించిన డివైస్ మాత్రమే పనిచేస్తున్నాయని అన్నారు. వేలిముద్రలు పడని కార్మికులకు మీసేవ కేంద్రాలలో ఐరిస్ మిషన్ సదుపాయం చేయాలన్నారు. తక్షణమే ఈ సమస్యను మీసేవ అధికారులు కానీ, లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు కానీ పరిష్కరించాలన్నారు.