మీ ఇంటి ఆడబిడ్డను ఆశీర్వదించండి

*బీజేపీ,టీఆర్ఎస్ పార్టీలు మునుగోడు కి చేసింది ఏమీ లేదు
*మునుగోడును అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ
*కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి
మునుగోడు అక్టోబర్02(జనం సాక్షి):
రాష్ట్రం ఏర్పాటు తర్వాత కేసీఆర్ కుటుంబ కుటుంబ పాలనగా అవతారమెత్తిన టీఆర్ఎస్ మతత్వాన్ని పెంచి పోషిస్తున్న బీజేపీ పార్టీల నాయకులు మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజలను మోసం చేసేందుకు ఎన్ని పన్నాగాలు పన్నినా మునుగోడు నియోజక వర్గ ప్రజలు నమ్మరని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్తి
అభ్యర్థి పాల్వాయి స్రవంతి అన్నారు.
 ఉప ఎన్నికల్లో భాగంగా మండలంలోని కొరటికల్  గ్రామంలో గడపగడపకు వెళ్లి
రానున్న ఉపఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ చేతిగుర్తుకు ఓటువేసి గెలిపించవలసిందిగా ఓటర్లను కోరారు అనంతరం మాట్లాడుతూ బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు మునుగోడు నియోజకవర్గ ప్రజలకు చేసింది ఏమిలేదని, ఎన్నికల సమయంలో ఏనాడు ఇటువైపు చూడని పార్టీలు ఎన్నికల ముసుగులో ఓట్లు అడిగేందుకు వస్తున్న నాయకులను నమ్మవద్దని అన్నారు.మునుగోడు అభివృద్ధి కోసం 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ మాత్రమే తపన పడుతుందని అన్నారు.
బీజేపీ, టీఆర్ఎస్  రెండు రైతు వ్యతిరేఖ పార్టీలే దేశంలో బీజేపీ,రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీల పాలనలో రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, రైతు వ్యతిరేఖ పార్టీలను తిప్పి పంపాలని అన్నారు.కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిపించిన మునుగోడు ప్రజలను మోసం చేస్తూ తను చేసుకున్న పనుల బిల్లులు25 కోట్ల రూపాయలను కాపాడుకునేందుకే బీజేపీ పార్టీలో చేరారని అన్నారు.ఏనాడు ప్రజల బాగోగులు చూడకుండా తన స్వార్థం కోసం పనిచేసిన రాజగోపాల్ రెడ్డి అసలు నిజస్వరూపమేంటో బయటపడిందని అన్నారు.ఇప్పటికైనామునుగోడు ప్రజలు గమనించి టీఆర్ఎస్ బీజేపీ పార్టీల అభ్యర్థులను తరిమికొట్టేందుకు సిద్దం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈకార్యక్రమంలో ఊకొండి ఎంపిటిసి పోలగోని సైదులు,నన్నూరు విష్ణువర్ధన్ రెడ్డి, మునుగోడు మాజీఎంపిటిసి పందుల భాస్కర్,మాజీ కోఆప్షన్ సభ్యులు ఎండి అన్వర్, ఆరేళ్ల
సైదులు,కొరటికల్ గ్రామశాఖ అధ్యకులు అయితగొని సైదులు,గుడిసె అంజయ్య,వార్డుసభ్యులు అన్నం సైదులు,మమిళ్ళ సౌజన్నమధురెడ్డి,మమిళ్ళగోపాల్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ గ్రామఅధ్యక్షులు బొలం యాదగిరి, అయితగొని నగేష్,ఎల్లంకి రమేష్,గడ్డం స్వామి, అయితగొని సురేష్, ఉడుతల శ్రీశైలంమల్గా కిరణ్,బొల్లం వెంకన్న,శ్రీను,అన్నం నాగరాజు,బోడిష వెంకటేశు,చిలక రాజ్ మహేష్ ఓర్సు వెంకన్న,ఓర్సు స్వామి,నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…..