హైదరాబాద్ : మీ సేవ కేంద్రంలో ఫోటో గుర్తింపు కార్డు సేవలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ మీ సేవ కేంంలో ఓటరు గుర్తింపు కార్డులో మార్పులు, చేర్పుల ప్రక్రియను కేంద్ర ఎన్నికల డిప్యూటీ కమిషనర్ వినోద్ ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మీ సేవ కేంద్రాల్లో ఈ సదుపాయం లభించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. ఓటర్లు తగు ఆధారాలతో దరఖాస్తు చేసుకుంటే నెల రోజుల్లో కొత్త గుర్తింపు కార్డు జారీ చేస్తామని తెలిపారు. త్వరలో పాన్‌కార్డు, ఏటీఎం తరహాలో ఓటరు గుర్తింపు కార్డులను రూపొందిస్తామని చెప్పారు.




