Thursday, 5 November 2026

ముందుజాగ్ర‌త్త‌ల‌తో ఆర్థ‌రైటిస్ నివార‌ణ‌ . …. వ‌చ్చిన త‌ర్వాత జీవితం బాధాక‌రం….

 అవేర్ గ్లెనీగ‌ల్ గ్లోబ‌ల్ ఆస్ప‌త్రిలో అన్నిర‌కాల చికిత్స‌లు
ఎల్బీనగర్  ( జనంసాక్షి )  ఆర్థ‌రైటిస్‌పై ముందునుంచి త‌గిన అవ‌గాహ‌న‌తో ఉండి, ముందుజాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకుంటే దాని బారిన ప‌డ‌కుండా ఉండవచ్చని   అవేర్ గ్లెనీగ‌ల్స్ గ్లోబ‌ల్ ఆస్ప‌త్రికి చెందిన‌ క‌న్స‌ల్టెంట్ ఆర్థోపెడిక్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ వి.వి. స‌త్య‌నారాయ‌ణ సూచించారు. అంత‌ర్జాతీయ ఆర్థ‌రైటిస్ డే సంద‌ర్భంగా బుధ‌వారం ఆస్ప‌త్రి ప్రాంగ‌ణంలో నిర్వ‌హించిన అవ‌గాహ‌న కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడారు. సాధార‌ణంగా మొత్తం ఆర్థ‌రైటిస్ కేసుల్లో 90 శాతం వ‌ర‌కు డీజ‌న‌రేటివ్‌.. అంటే వ‌య‌సుతో పాటే వ‌స్తాయ‌ని,  కొన్నిసార్లు చిన్న వ‌య‌సులోనూ వ‌స్తాయి. ఇవి కాక ఇంకా రుమ‌టాయిడ్ ఆర్థ‌రైటిస్‌, ఇన్‌ఫ్ల‌మేట‌రీ ఆర్థ‌రైటిస్ కూడా ఉంటాయి. కొంత‌మందిలో యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉండ‌టం వ‌ల్ల కూడా ఈ స‌మ‌స్య వ‌స్తుందనిఅన్నారు  . ఆర్థరైటిస్ వస్తే, ఆలస్యం చేయొద్దు, వైద్యుల వద్దకు తప్పక రావాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దేన్ క్యూర్ అని, ముందుగానే కొన్ని వ్యాయామాలు చేయాలని , జంక్ ఫుడ్స్ తినకూడదని, ఆరోగ్యకరమైన అలవాట్లు చేసుకోవాలని సూచించారు  . రోజూ సరైన ఆహారం, వ్యాయామం, నిద్ర ఉండాలని . ఆర్థరైటిస్‌లో కీళ్ల నొప్పులు వస్తే కొన్నిసార్లు మోకాళ్ల మార్పిడి కూడా చేయాల్సి ఉంటుందని తెలిపారు  .పెద్ద పెద్ద సర్జరీల వల్ల రోగులు మంచానికే ప‌రిమితం అవుతారని, వాళ్లు త‌మ రోజువారీ పనులు చేసుకోలేరని చెప్పారు  . ల‌క్ష‌ణాలు ఎన్నో ఉన్నాయి..కీళ్ల‌నొప్పులు, వాపులు, ఎర్ర‌బార‌డం, బిగుతుగా అవ్వ‌డం.. వీటితో పాటు పొద్దున్నే నిద్ర‌లేచాక మంచం మీద నుంచి లేవ‌లేక‌పోవ‌డం ప్ర‌ధాన స‌మ‌స్య‌. ఇవికాక మోకాళ్లు, అరిచేయి, అరికాలు, తుంటినొప్పి, మెడనొప్పి, వెన్నునొప్పి, స్పాండిలైటిస్‌, ఇవన్నీ ఆర్థరైటిస్ లక్షణాలే. ఈ వ్యాధి రాకుండా కూడా మ‌నం జాగ్ర‌త్త ప‌డొచ్చు. పురుషుల కంటే మ‌హిళ‌ల్లో ఈ స‌మ‌స్య ఎక్కువగా కనిపిస్తుంది. అది ఎందుకంటే, వాళ్లకి ఆస్టియోపోరోసిస్ ఉంటుంది. రుతుక్రమం, హార్మోన్లలో మార్పుల వల్ల ఎముకలు త్వరగా అరిగిపోతాయి. మృదులాస్థి కూడా పాడ‌వుతుంది. అందువల్ల వారిలో ఈ స‌మ‌స్య ఎక్కువగా ఉంటుందని అన్నారు  . అంత‌ర్జాతీయ ఆర్థ‌రైటిస్ డే సంద‌ర్భంగా  ప్ర‌త్యేక ప్యాకేజితో రూ.799కే అందుబాటులో ప‌రీక్ష‌లు చేయబడతాయి అని తెలిపారు  .  ఈ అవ‌గాహ‌న కార్య‌క్ర‌మంలో అవేర్ గ్లెనీగ‌ల్స్ గ్లోబ‌ల్ ఆస్ప‌త్రి ఆర్థోపెడిక్ విభాగాధిప‌తి, అత్యంత సీనియ‌ర్ ఆర్థోపెడిక్ వైద్యుడు డాక్ట‌ర్ జె.విద్యాసాగ‌ర్, ఇంకా ఆర్థోపెడిక్ వైద్యులు  డాక్టర్ అశ్విన్ కుమార్ రెడ్డి, డాక్టర్ వీవీ సత్యనారాయణ, ఆస్ప‌త్రి సీఓఓ సత్వీందర్ సింగ్ సభర్వాల్ త‌దిత‌రులు పాల్గొన్నారు.
Attachments area