Tuesday, 3 November 2026

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల ఫైర్‌

హైదరాబాద్‌: సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రాబోయే తెలంగాణను అడ్డుకున్నారని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు ఫైర్‌అయ్యారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణకు బద్ద వ్యతిరేకి అని ఎంపీ వివేక్‌, పొన్నం ప్రభాకర్‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీర్ఘకాలిక సమస్య తెలంగాణకు కాంగ్రెస్‌ అధిష్ఠానం పరిష్కారం చూపుతుందని ఎంపీలు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రలతో తెలంగాణ సమస్యను ముడి పెట్టొద్దని వారు కోరారు. కాగా, ఎంనీలమంతా రాజీనామాలు చేయాలనే నిర్ణయించుకున్నామని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తెలంగాణ వాదులందరినీ కలుపుకు పోవాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *