ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాష్ట్ర ఐజేయు పిలుపుమేరకు పోస్ట్ కార్డు ఉద్యమం
ధర్మపురి( జనం సాక్షి ) జగిత్యాల జిల్లా ధర్మపురి మండల కేంద్రంలో రాష్ట్ర ఐజేయు పిలుపుమేరకు బుధవారం ఉదయం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మధుమహదేవ్ ఆధ్వర్యంలో యూనియన్ సభ్యులందరికీ కలిసి పోస్టు కార్డు ఉద్యమంలో పాల్గొని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు పోస్టు కార్డు ద్వారా సమస్యలను తెలియజేశారు తదనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా జర్నలిస్టుగా పనిచేస్తున్నాను. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించిన విషయం మీకు తెలిసిందే. ఉద్యమ సమయంలో, తెలంగాణ వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత తమరు జర్నలిస్టులందరికీ ఇంటి స్థలంతో పాటు ఇల్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. 2014లో జరిగిన ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పేర్కొన్నారు. తొమ్మిదేళ్లు గడుస్తున్న కూడా మాకు ఇప్పటి వరకు తమరి ఇచ్చిన హామీ నెరవేరలేదు. ఇప్పటికైనా వెంటనే స్పందించి మాకు ఇంటి స్థలంతో పాటు ఇల్లు మంజూరు చేయాలని కోరుచున్నాము. అలాగే ప్రభుత్వం జారీ చేసిన హెల్త్ కార్డులు సక్రమంగా పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని విజ్ఞప్తి చేస్తున్నాం.ఈ కార్యక్రమంలో నేషనల్ కౌన్సిల్ నెంబర్ మాజీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు సురేందర్, ధర్మపురి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మధు మహదేవ్, జనరల్ సెక్రెటరీ బొడ్డు కిషన్, ఎస్సీ ఎస్టీ గౌరవ అధ్యక్షుడు క్యాదాసు స్వామి, జగిత్యాల జిల్లా ఈసీ మెంబర్ కరిన్నే సంతోష్, బొంగురాల రాజేష్ , ఎస్సీ ఎస్టీ జర్నలిస్టు కోశాధికారి చీటీ సతీష్, ప్రెస్ క్లబ్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.