వరద ప్రాంతాలకు ప్రభుత్వ విప్ రేగా పర్యటన
ఆళ్లపల్లి ఆగస్టు 01( జనం సాక్షి)
ఆళ్లపల్లి మండలంలోని వరద ప్రాంతాలకు మంగళవారం ప్రభుత్వ విప్ రేగ కాంతారావు పర్యటించారు. ఈ సందర్భంగా వారు దెబ్బతిన్న బీటీ రోడ్లను పరిశీలించి ,ఉన్నత అధికారులతో చరవాణిలో మాట్లాడారు .రోడ్డు మరమ్మతుల పనులు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. తాత్కాలికంగా జరుగుతున్న పనులను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు .వర్షాల కారణంగా నష్టపోయిన ఇండ్లను పరిశీలించారు .ప్రతి కుటుంబానికి ప్రభుత్వం నుంచి పరిహారం అందిన కృషి చేస్తానని తెలిపారు. ఇందులో భాగంగా గ్రామాల్లో ప్రధానంగా రహదారులు నిర్మాణంలో ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ఆళ్లపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికల 17 కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ మంజు భార్గవి, జడ్పిటిసి కొమరం హనుమంతు అధికారులు తదితరులు పాల్గొన్నారు