Wednesday, 4 November 2026

ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారం తో సమస్యల శాశ్వత పరిష్కారం : విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

 ఎల్బీ నగర్ (జనం సాక్షి  ) బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్  అల్మాస్ గూడ తిరుమల నగర్, శ్రీ సాయి హోమ్స్ కాలనీలలో కాలనీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం లో ముఖ్య అతిధిగా విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి  పాల్గొన్నారు . కనీస వసతుల కల్పనలో భాగంగా తాగునీటిని అందించినందుకు మంత్రికి ధన్యవాదాలు తెల్పిన ఆయా కాలనీల వాసులు. అనంతరం జరిగిన సభలో ప్రజలనుద్దేశించి మంత్రి సబితా ఇంద్రారెడ్డి  మాట్లాడుతూ  నియోజకవర్గమే నా ఇల్లు అని,ప్రతి క్షణం అభివృద్ధి గురించే ఆలోచిస్తానన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్  సహకారం తో సమస్యల శాశ్వత పరిష్కారం కోసం  చర్యలు తీసుకుంటున్నమన్నారు.నగర శివారు పట్టణ ప్రాంతాల్లో నీటి సమస్య పరిష్కారానికి, ఇంటింటి నల్లాలతో పాటు నూతన లైన్లు,ట్యాంకుల నిర్మాణాల కోసం 1200 కోట్ల నిధులు విడుదల చేసారని తెలిపారు.  ముఖ్యమంత్రి కేసీఆర్  సూచనలతో,మునిసిపల్,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ గారి చొరవతో రింగ్ రోడ్డు చుట్టుప్రక్కల ప్రాంతాల అభివృద్ధి ద్వేయంగా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం.      పెరుగుతున్న జనాభా,కాలనిలకు 50 సంవత్సరాల వరకు కూడా ఎలాంటి సమస్య రాకుండా పకడ్బందీగా కార్యాచరణ రూపొందించి,అమలు చేస్తున్న ప్రభుత్వం.నగర శివారు ప్రాంతాల్లో మేడ్చల్,రంగారెడ్డి జిల్లాలే కీలకమని ఆ దిశగా ఆయా ప్రాంతాల సమగ్రాభివృద్ధి ద్వేయంగా కృషి చేస్తున్నట్లు,గతంలో ఎన్నడూ లేనివిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్  పట్టణ స్థానిక సంస్థల ప్రతినిధులు అయిన మేయర్లు, చైర్మన్ల తో సమావేశాలు ఏర్పాటు చేసి దిశ నిర్దేశం చేసారన్నారు.డివిజన్ ల వారీగా ప్రణాళికలు రూపొందించి అభివృద్ధి పనులు చేపట్టాలని ఆదేశించారని తెలిపారు. అదేవిధంగా స్థలం ఉంటే ఆయా డివిజన్లలో కమ్యూనిటీ హాల్ లు, ఓపెన్ జిమ్ లు,పార్క్ లు,లైబ్రరీ లు,నర్సరీ,క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలని అదేశించారని మంత్రి పేర్కొన్నారు. చెరువులు మురికి కుపాలుగా కాకుండా సుందరికరిస్తూ ఆహ్లాదకరమైన వాతావరణం లో అందరూ సేద దిరేలా పనులు చేపడుతున్నామని,మన పూర్వీకులు బాలపూర్ మండలం లో 32 గొలుసుకట్టు  చెరువులు,కుంటలు ఏర్పాటు చేసారని, వాటిని అభివృద్ధి చేస్తూ భావితరాలకు ఆస్తిగా అందించటానికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. వర్ష కాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల కార్యక్రమంలో పాల్గొనాలని, డెంగ్యూ, మలేరియాలు రాకుండా అరికట్టాలని కాలనీ ప్రజలకు మంత్రి పిలుపునిచ్చారు.   మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు అవుతున్న సందర్భంగా 15 రోజుల పాటు నిర్వహిస్తున్న స్వతంత్ర భారతదేశ వజ్రోత్సవాలు కార్యక్రమాలలో
అందరూ పాల్గొని దేశ ఔన్నత్యాన్ని వెలుగెత్తి చాటలన్నారు.