Wednesday, 4 November 2026

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత

 

 

 

 

 

 

జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలంలోని రొంపికుంట గ్రామానికి చెందిన కూచన వినోద్, పోల్దాసరి సురేష్ లు ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది పెద్దపల్లి జిల్లా జడ్పిచైర్మన్, మంథని నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంఛార్జ్ పుట్ట మధూకర్ ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధికి సిఫారసు చేసుకోగా కూచన వినోద్ కు రూ. 60 వేలు, పోలుదాసరి సురేష్ కు రూ. 24 వేలు మంజూరైయ్యాయి. మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును జడ్పిచైర్మన్ పుట్ట మధు ఆదేశాల మేరకు మంగళవారం బీఆర్ఎస్ పార్టీ కమాన్ పూర్ మండలశాఖ ఆధ్వర్యంలో రొంపికుంట గ్రామంలో లబ్ధిదారుకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో కమాన్ పూర్ మండల ఎంపీపీ రాచకొండ లక్ష్మీ, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు పిన్ రెడ్డి కిషన్ రెడ్డి, వైస్ ఎంపిపి ఉప్పరి శ్రీనివాస్ యాదవ్, పీ. ఏ.సీ. ఎస్ వైస్ చైర్మన్ చిందం తిరుపతి, బీ. ఆర్. ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కొయ్యడ రవి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాచకొండ రవి, పెండ్లి నారాయణ, కొండి అనిల్, ఊరడీ శ్రీనివాస్, కొయ్యడ కుమార్, పులిపాక బాణయ్య, తాళ్ళ సత్యనారాయణ, పులిపాక రాయలింగు, కాటకం నాగరాజు, తొగరి నర్సయ్య, కొండి సంపత్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు